శునకాన్ని తొక్కించిన ఆటో.. డ్రైవర్ వెంటపడి మరీ నరికిన యజమాని!

  • దేశ రాజధానిలో ఘటన
  • పొరపాటున కుక్కను తొక్కించిన డ్రైవర్ రాణా
  • కత్తిదాడితో ఆసుపత్రిలో చికిత్స
పెంపుడు జంతువులను అందరూ ఒకేలా తీసుకోరు. కొందరు వ్యక్తులు ఓ దశ వరకూ వాటితో అనుబంధం పెంచుకుంటే.. మరికొందరు మాత్రం తమ కుటుంబంలో సభ్యుడిగా పరిగణిస్తారు. వాటికి ఏమైనా జరిగితే తట్టుకోలేరు. తాజాగా తమ పెంపుడు కుక్కను ఓ ఆటో ఢీకొట్టి, తొక్కి చంపడంతో ఓ యజమాని ఆగ్రహోద్రుడయ్యాడు. ఆటో డ్రైవర్ ను వెంటపడి మరీ నరికాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీకి చెందిన విజేంద్ర రాణా ఆటోను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆటో నడుపుతుండగా, ఓ శునకం ఎదురుగా వచ్చింది. వాహనాన్ని అదుపు చేయలేకపోయిన రాణా దానిపైకి ఎక్కించేశాడు. దీంతో సదరు కుక్క యజమాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఓ కత్తి తీసుకుని రాణాతో పాటు ఆటోలో ఉన్న అతని సోదరుడి వెంట పడ్డాడు. చివరికి ఆటోను ఆపి మరీ వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అన్నదమ్ములను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
auto
dog
sword
attack
Police
newdelhi
driver

More Telugu News